అలా చూసుకుంటే….ఫిదా కన్నా ఇదే బిగ్గెస్ట్ హిట్!!

0
355

‘లోఫర్’.. ‘మిస్టర్’ మాత్రం వరుణ్‌కు అన్ని రకాలుగా చేదు అనుభవం మిగిల్చాయి వరుణ్ తేజ్ కి… ఉన్న ఇమేజ్‌తో సంతృప్తి చెందక మాస్ చొక్కా తొడుక్కోబోయి బొక్క బోర్లా పడ్డాడు వరుణ్. అలాంటి సమయం లో ‘ఫిదా’ అతడికి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చింది. కానీ ‘ఫిదా’ వరుణ్ కెరీర్లో హిట్టు గా నిలిచింది కానీ.. నిజంగా ఆ సక్సెస్‌ లో అతడి క్రెడిట్ ఎంత అంటే మాత్రం ఆలోచించాల్సిందే. ‘ఫిదా’ సక్సెస్ క్రెడిట్లో మేజర్ షేర్ సాయిపల్లవికి వెళ్లిపోయింది.

మిగతా క్రెడిట్ శేఖర్ కమ్ముల తీసుకున్నారు. వరుణ్ అందులో బాగానే చేసినప్పటికీ అతడి గురించి జనాలు పెద్దగా చర్చించుకోలేదు. ఈ నేపథ్యంలో మరో సక్సెస్‌తో పాటు తనేంటో రుజువు చేసుకోవాల్సిన అవసరం వరుణ్‌కు వచ్చింది. ‘తొలి ప్రేమ’ సరిగ్గా అతడికి అలాంటి ఫలితాన్నే అందించింది. ఈ సినిమాలో వరుణ్ నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. సినిమా విజయంలో అతను తనవంతుగా కీలక పాత్ర పోషించాడు.

ఆదిగా విలక్షణ వ్యక్తిత్వం ఉన్న కుర్రాడిగా వరుణ్ మెప్పించాడు. రొమాంటిక్ సీన్లలో.. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో సమానంగా ఆకట్టుకున్నాడు. అతడి లుక్స్ కూడా మెప్పించాయి. తొలిసారిగా డ్యాన్సులతోనూ సత్తా చాటుకునే ప్రయత్నం చేశాడు వరుణ్. నటుడిగా ‘కంచె’ తర్వాత వరుణ్‌కు ‘తొలి ప్రేమ’ ఒక మైలురాయి అని చెప్పొచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here