ఏం..సినిమారా బాబు…నైజాం చరిత్ర సృష్టించిన ఫిదా

జులై 21 రిలీజ్ కి ముందు ఫిదా సినిమాపై కనీస అంచనాలు కూడా లేవు…కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ తో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు…రెండు వారాలు దగ్గరపడుతున్నా సినిమా జోరు చూసి టోటల్ టాలీవుడ్ షాక్ అవుతుంది.

కెరీర్ బెస్ట్ హిట్ గా సినిమాకి పని చేసినవారందరికీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఫిదా సినిమా నైజాం ఏరియాలో సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు…ఇప్పటివరకు 12 కోట్ల షేర్ దాకా వసూల్ చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా.

చిన్న సినిమాల్లో ఏ సినిమా సాధించలేని రికార్డ్ ఇది…టోటల్ రన్ లో కచ్చితంగా 16 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేయడం ఖాయం అని అంటుండటంతో ఈ సినిమా సృష్టించిన రికార్డులు ఇప్పట్లో మరే చిన్న సినిమా బ్రేక్ చేసే అవకాశం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Leave a Comment