ఫైనల్ గా సంక్రాంతి సినిమాలలో ప్రేక్షకుల ఓటు ఈ సినిమాకే

0
22346

  ఈ ఏడాది సంక్రాంతి పండగ ని పురస్కరించుకుని నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి అయితే ఆ నాలుగు సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్టు మిగత్వాన్ని ప్లాప్ అయ్యాయి. ఇంతకీ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా ……. బాలకృష్ణ జై సింహా . జనవరి 10న భారీ ఎత్తున విడుదలైన పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. అయితే పవన్ కళ్యాణ్ కున్న స్టార్ డం తో ఓ మోస్తారు వసూళ్లు వస్తున్నాయి. 


ఇక జనవరి 12న విడుదలైన సూర్య గ్యాంగ్ చిత్రానికి కూడా ఆదరణ లభించడం లేదు, స్టోరీ లైన్ బాగున్నప్పటికి పాత సినిమాని పోలి ఉండటంతో దానిని ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. ఇక ఈరోజు రిలీజ్ అయిన రాజ్ తరుణ్ సినిమా రంగుల రాట్నం సినిమా సీరియల్ కంటే దారుణంగా ఉండటంతో ఆ సినిమాని కూడా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.

ఇక మిగిలింది ఒక్క బాలయ్య చిత్రమే ! బాలయ్య సినిమా జై సింహా కూడా గొప్పగా ఏమీలేదు కానీ మాస్ చిత్రం కావడంతో గుడ్డి లో మెల్ల లాగా సూపర్ హిట్ కొట్టేసింది. మొత్తానికి ఈ ఏడాది బాలయ్య కు పోటీ లేకుండా పోయింది.ఇవి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల ఫలితాలు…కానీ సినిమాల కలెక్షన్స్ చిట్టా మొత్తం తెలియాలి అంటే 16 వరకు ఆగాల్సిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here