బాహుబలి 2 అవుట్….ఇక నుండి నాన్ మహేష్ రికార్డ్!!

0
564

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ళతో రన్ అవుతుంది. కాగా సినిమా రిలీజ్ అయ్యి 4 వ వారంలో అడుగు పెట్టగా సినిమా పక్క రాష్ట్రాలలో తమిళనాడు లో మంచి వసూళ్ళని రాబడుతూ దూసుకు పోతుంది. సినిమా అక్కడ ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ తెలుగు వర్షన్స్ విషయంలో బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేసింది.

బాహుబలి 2 అక్కడ తెలుగు వర్షన్ కి గాను చెన్నై ఏరియాలో 1.65 కోట్ల గ్రాస్ ని వసూల్ చేయగా ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలో ఎ సినిమా ఈ రికార్డ్ ను అందుకోలేదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మాత్రం సంచలనం సృష్టించింది.

ఈ సినిమా అక్కడ డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే అక్కడ 4 వ వీకెండ్ ముగిసే సరికి 1.66 కోట్ల గ్రాస్ ని అందుకుంది…దాంతో ఇప్పటి వరకు అక్కడ నాన్ బాహుబలి రికార్డ్ గా పరిగణించిన ఈ రికార్డ్ ఇప్పుడు నాన్ మహేష్ రికార్డ్ గా చెప్పుకోవాలి. మరి ఈ రికార్డును అక్కడ డైరెక్ట్ తెలుగు వర్షన్ తో బ్రేక్ చేసే సత్తా ఉన్న హీరో ఎవరో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here