ఫ్యాన్స్ కి ప్రాణం తిరిగొచ్చింది…కారణం ఇదే

0
2517

  అజ్ఞాతవాసి ఇచ్చిన రిజల్ట్ కి చిత్ర యూనిట్ ఎంత బాధపడుతున్నారో తెలియదు గాని పవన్ హార్డ్ కొర్ ఫ్యాన్స్ మాత్రం చాలా నిరాశ చెందుతున్నారు. హిట్ అయితే చిందులు ఎలా ఉండేవో చెప్పవచ్చు గాని సినిమా ఫట్ అయితే అభిమానుల బాధ వర్ణనాతీతం. సోషల్ మీడియాలో కూడా పవన్ అభిమానులు చాలా వరకు సైలెంట్ అయిపోయారు. అజ్ఞాతవాసి హిట్టుతో విమర్శకులకు గట్టిగా సమాధానం చెబుదామనుకున్న ఫ్యాన్స్ కి ఏ మాత్రం అవకాశం దొరకలేదు.

ఇక అసలు విషయానికి వస్తే సినిమా మొదట నుంచి హిట్టు టాక్ తెచ్చుకుంటుందని చిత్ర యూనిట్ అనుకుంది. ఎలాగూ కలెక్షన్స్ గట్టిగా వస్తాయి కదా ఆ తరువాత పండగకి సినిమాలో వెంకటేష్ అతిధి పాత్రకు సంబందించిన సీన్స్ ను యాడ్ చేద్దామని అనుకుంది. కానీ ఇప్పుడు కొంచెం నష్టాల నుంచి బయటపడాలని ఆ సీన్ యాడ్ చేస్తున్నారు. ఆ విషయం తెలిసిందే.

ఇక ఈ తీసిపోతల లెక్కలను ఓసారి చూస్తే.. మొత్తంగా సినిమాలో 12 నిమిషాల వరకు తీశారట. ఇక ఎక్కువగా బోర్ కొట్టకుండా బాగా ఉండే సీన్లను ఓ 7 నిమిషాల 26 సెకన్ల వరకు యాడ్ చేశారట. అందులోనే వెంకటేష్ – పవన్ సీన్ కూడా ఉందని టాక్. మరి ఈ రోజు సినిమా ఈ అడ్వాంటేజ్ ని వాడుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here