రాజశేఖర్ గరుడ వేగ మూవీ రివ్యూ…సూటిగా సుత్తి లేకుండా!!

సీనియర్ హీరోలలో ఆల్ మోస్ట్ ఫేడ్ అవుట్ అయిన హీరోలలో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ఒకరు. ఒకప్పుడు సూపర్ హిట్లు కొట్టిన ఈ హీరో ఇప్పుడు సోలో హీరో ఒక్క హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండిపోయి సినిమాలు మానేయగా ఇలాంటి సమయంలో గరుడవేగ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. చందమామ కథలు తో నేషనల్ అవార్డ్ కొట్టిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకుడు అవ్వడంతో కొంత ఆసక్తి పెరిగింది.

ఇక సినిమా కి 28 కోట్ల బడ్జెట్ అయిందని చెప్పినప్పుడు ఇంత బడ్జెట్ లో ఏం తీశారు అనుకున్న వాళ్ళ కి షాక్ ఇచ్చిన సినిమా ప్రతీ ఫ్రేమ్ ఎంతో రిచ్ గా ఉండి ఈ మధ్య అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల కన్నా 100% అవుట్ పుట్ తో షాక్ ఇచ్చింది.

యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉండగా యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వారికి సినిమా కన్నుల పండగే అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా ఫస్టాఫ్ మైండ్ బ్లోయింగ్ గా ఉండగా సెకెండ్ ఆఫ్ కొద్దిగా స్లో అయినా చివరికి సాటిస్ ఫై గా ప్రేక్షకులు సినిమా బాగుంది అన్న ఫీలింగ్ తో థియేటర్ నుండి బయటికి వస్తారు…మీరు ఇలాంటి సినిమాలు ఇష్టపడితే ఈ సినిమా మీ కోసమే…ఓవరాల్ గా రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు.

Leave a Comment