ఫ్లాఫ్ మూవీస్ కే ఇలా కొడితే…ఒక్క బ్లాక్ బస్టర్ పడితే…?? | 123Josh.com
Home న్యూస్ ఫ్లాఫ్ మూవీస్ కే ఇలా కొడితే…ఒక్క బ్లాక్ బస్టర్ పడితే…??

ఫ్లాఫ్ మూవీస్ కే ఇలా కొడితే…ఒక్క బ్లాక్ బస్టర్ పడితే…??

0
2800

హీరో గా కెరీర్ ని మొదలు పెట్టి విలన్ గా సూపర్ సక్సెస్ అయ్యి తిరిగి హీరోగా కూడా సక్సెస్ అయిన గోపీచంద్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ లౌక్యం సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నాడు….10 కోట్ల బిజినెస్ తో ఆ సినిమా 23 కోట్ల షేర్ ని రాబట్టింది. కానీ తర్వాత వరుస పరాజయాలు గోపీచంద్ కెరీర్ లో డౌన్ అయ్యేలా చేశాయి.

ఇంత జరిగినా అందులో మంచి ఏంటి అంటే…గోపీచంద్ సినిమాలు చూసే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు….ఎ సినిమా చేసినా ప్రమోషన్ ఉన్నా లేకున్నా మినిమమ్ 2 నుండి 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ మాత్రం గ్యారెంటీగా వస్తున్నాయి.

రీసెంట్ గా వచ్చిన గౌతమ్ నంద రిలీజ్ కి 15 రోజుల ముందు నుండే ప్రచారం చేస్తే 3.3 కోట్ల ఓపెనింగ్స్ దక్కాయి….తర్వాత చేసిన ఆక్సీజన్ కి ఎలాంటి ప్రమోషన్ లేకుండానే 2 కోట్ల ఓపెనింగ్స్ దక్కాయి…ఇప్పుడు 25 వ సినిమా పంతం కి 3.1 కోట్ల ఓపెనింగ్స్ దక్కాయి…అంటే యావరేజ్ సినిమాలకే ఇలాంటి ఓపెనింగ్స్ ని సాధిస్తున్న గోపీచంద్ కి ఒక్క పక్కా లక్ష్యం తర్వాత బ్లాక్ బస్టర్ పడితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here