గోపీచంద్ [ఆక్సీజన్] రివ్యూ…సూటిగా సుత్తి లేకుండా!!

    కెరీర్ లో ఎత్తుఫల్లాలు సహజం… హీరో గా ఎంట్రీ ఇచ్చి విలన్ గా మారి మళ్ళీ హీరో గా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ కి కెరీర్ తొలినాళ్ళలో మంచి విజయాలు దక్కినా తర్వాత ఫ్లాఫ్స్ పడటం స్టార్ట్ అయింది.  మళ్ళీ లౌక్యం తో సూపర్ హిట్ కొట్టినా తర్వాత మళ్ళీ జిల్, సౌఖ్యం లాంటి ఫ్లాఫ్స్ తర్వాత గౌతమ్ నంద లాంటి మంచి సినిమా కూడా సరైన సమయం లో రాక ఫ్లాఫ్ గా మారింది.

ఇలాంటి సమయం లో వచ్చిన ఆక్సీజన్ గోపీచంద్ కి తిరిగి ఊపిరి పోసిందా అంటే….ఆల్ మోస్ట్ పోసినట్లే పోసి చివర్లో ఆగిపోయింది అని చెప్పాలి. రొటీన్ తెలుగు కమర్షియల్ స్టొరీ లైన్ అయిన రివేంజ్ బ్యాగ్ డ్రాప్ తోనే సినిమా తెరకెక్కింది. మంచి పాయింట్ తో దర్శకుడు జ్యోతికృష్ణ సినిమాను మొదలు పెట్టాడు.

కానీ సినిమా కథ సాగుతున్న కొద్ది గాడి తప్పి మరోలా మారింది. కానీ ఉన్నంతలో గోపీచంద్ ఆకట్టుకోగా అను ఎమాన్యుఏల్ మరియు రాశిఖన్నా లు మెప్పించారు. మిగిలిన నటీనటులు ఓకే అనిపించుకున్నారు. ఇలాంటి రొటీన్ కథలు చూసి ఇష్టపడే వారికి ఆక్సీజన్ నచ్చే అవకాశం ఉంది.

కానీ ఈ మధ్య తెలుగు లో కాన్సెప్ట్ సినిమాలు కొత్త తరహా కథలు రాజ్యం ఏలుతున్న నేపధ్యం లో రొటీన్ కథలలో కొన్ని మాత్రమే మెప్పు పొందాయి. అసలే ఫామ్ లో లేని సమయంలో ప్రయోగాలు చేయడం ఇష్టం లేని గోపీచంద్ రొటీన్ బాటే పట్టినా…

ఇందులో ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉండటం ఆడియన్స్ కి ఎంతోకొంత నచ్చితే సినిమా కొంత సేఫ్ అయ్యే చాన్స్ ఉంది. ఓవరాల్ గా ఓకే అనిపించేలా ఉన్న ఆక్సీజన్ కి 2.75 స్టార్స్ ఇవ్వొచ్చు. ఇక వీకెండ్ లో దాదాపు 4 నుండి 5 సినిమాలు ఉన్న నేపధ్యంలో ఈ సినిమా ఎంత వరకు కలెక్షన్స్ రాబడుతుంది అనే దానిపై సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Leave a Comment