రంగస్థలంతో సుకుమార్ కి ఎంత లాభం వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
623

  ‘రంగస్థలం’ చిత్రానికి గాను సుకుమార్‌ పారితోషికం తీసుకోలేదట. ముందుగా ఇచ్చిన అడ్వాన్స్‌ తప్ప అతనికి నిర్మాతలు నగదు రూపంలో ఏమీ ఇవ్వలేదట. తన చిత్రాలు ఓవర్సీస్‌లో బాగా ఆడుతుంటాయి కనుక ఓవర్సీస్‌ హక్కులు కావాలని అడిగాడట. రామ్‌ చరణ్‌కి ఓవర్సీస్‌ మార్కెట్‌ అంతగా లేకపోవడంతో అక్కడ్నుంచి ఆఫర్లు కూడా ఎక్కువేం రాలేదు. మొదట తొమ్మిది కోట్లకి కొనడానికి వచ్చిన వాళ్లు కూడా వరుసగా పెద్ద సినిమాలు ఫెయిలవడంతో వెనక్కి తగ్గారు. దీంతో ఓవర్సీస్‌ హక్కులు సుకుమార్‌ వశమయ్యాయి.

మహా అయితే రెండు మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ యుఎస్‌ నుంచి వస్తుందని అనుకున్న ఈ చిత్రం ఫుల్‌ రన్‌లో మూడున్నర మిలియన్ల గ్రాస్‌ వసూళ్లని యుఎస్‌లో సాధించనుంది. ఇక అరబ్‌ దేశాలు, యుకె, ఆస్ట్రేలియాలోను అదరగొట్టిన ఈ చిత్రానికి అటునుంచి రెండు కోట్ల వరకు అవుట్‌రైట్‌ బిజినెస్‌ జరిగింది. కేవలం యుఎస్‌ షేర్‌ పన్నెండు కోట్ల వరకు వుంటుందని అంచనా. అంటే రఫ్‌గా సుకుమార్‌కి పధ్నాలుగు కోట్లు వస్తున్నాయన్నమాట.

దర్శకుడు చిత్రాన్ని నిర్మించి భారీగా నష్టపోయిన సుకుమార్‌ ఆ నష్టాల నుంచి కోలుకోవడమే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా డిమాండ్‌ వున్న దర్శకుడైపోయాడు. ఇంతకాలం అతని సినిమాలకి కమర్షియల్‌ వేల్యూ వుండదని మొహం చాటేసిన నిర్మాతలే రంగస్థలంతో అతని స్థాయి ఏమిటో తెలిసి అడ్వాన్సుల మీద అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here