చస్….ఇదీ న్యూస్ అంటే…ఎన్టీఆర్ కోసం కోలివుడ్….??

0
642

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే… ఎన్టీఆర్ తో సినిమా కోసం టాలీవుడ్ లోనే కాకుండా కోలివుడ్ నుండి కూడా డైరెక్టర్స్ క్యూ లు కడుతున్నారు. ఎన్టీఆర్ మాత్రం తనకున్న ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటూ తన అప్ కమింగ్ మూవీస్ ని ప్లాన్ చేసుకుంటూ వరుస విజయాలతో అభిమానులను మరింత ఆనందాన్ని కలిగిస్తున్నాడు అని చెప్పొచ్చు.

ఇక ఎన్టీఆర్ కోసం క్యూ లో ఉన్న డైరెక్టర్స్ కోలివుడ్ లో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కూడా ఉన్నట్లు సమాచారం… ఈ ఇద్దరి కలయికలో జనతాగ్యారేజ్ తర్వాత టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు ఓ మూవీ ని ప్లాన్ చేయగా అప్పటికే అట్లీ అనుకోకుండా విజయ్ తో మెర్సల్ ని ఎన్టీఆర్ జైలవకుశ ని కమిట్ అయ్యాడు.

కాగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి…ఎన్టీఆర్ వరుస సినిమాలను ఒప్పుకోగా అట్లీ మళ్ళీ విజయ్ తో సినిమా కి సిద్ధం అవుతున్నాడు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉందంటూ ఇప్పుడు వార్తలు ఇండస్ట్రీ లో శిఖారు చేస్తున్నాయి…మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here