ఇది మామూలు డిసాస్టర్ కాదు..చరిత్రకెక్కే డిసాస్టర్ సామి!!

0
397

  మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా లావణ్య త్రిపాటి హీరోయిన్ గా వివివినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇంటెలిజెంట్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా తొలి ఆటకే దిమ్మతిరిగే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఛలో మరియు కొత్త సినిమా తొలిప్రేమ నుండి తీవ్ర పోటి ని ఎదుర్కొన్న ఈ సినిమా ఎ దశలోనూ కోలుకోలేక పోయింది.

దాంతో మూడు రోజుల్లో కేవలం 3.15 కోట్ల షేర్ ని 6 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసిన సినిమా 4 వ రోజు అయినా ప్రభావం చూపుతుందా అనుకుంటే ఏమాత్రం ప్రభావం చూపకుండానే చేతులు ఎత్తేసింది. పాత సినిమాలు ఛలో, భాగమతి కన్నా కూడా దారుణంగా డ్రాప్ అయ్యింది.

మొత్తం మీద 4 రోజుల్లో సినిమా 3.6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టి సాయి ధరం తేజ్ కెరీర్ లోనే కాదు చరిత్రలో నిలిచి పోయే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో కూడా ఒకటిగా చేరే లాస్ ని లాంగ్ రన్ లో సాధించబోతుంది ఈ సినిమా. సాయి ధరం తేజ్ కెరీర్ కి కూడా ఇది పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here