ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలే….4 రోజుల్లో భీభత్సం (1)

0
226

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్28  కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో ఫుల్ జోరు మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కాగా మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక గా సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయబోతున్న విషయం తెలిసిందే.

కాగా దానికన్నా ముందు రెండు రోజుల ముందు సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగే అవకాశం పుష్కలంగా ఉందని టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది. మే 17 న కానీ 18 న కానీ ఈ అనౌన్స్ మెంట్ ఉండబోతుందని ఇండస్ట్రీ లో చెప్పు కుంటున్నారు.

ఎన్టీఆర్ ఈ సినిమా కోసం లుక్ అండ్ స్టైల్ మొత్తం మార్చుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ ఫామ్ లో లేకున్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమ జోరు మీదున్నాడు కాబట్టి ఈ సినిమా సెన్సేషన్స్ ని క్రియేట్ చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఇక సినిమా ఎట్టి పరిస్థితుల కూడా దసరా కి ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here