బడ్జెట్ 10 కోట్లు…తెలుగు బిజినెస్ 3.2 కోట్లు…టోటల్ కలెక్షన్స్ తెలిస్తే….???

0
1013

  బిచ్చగాడు అనే సినిమాతో తెలుగు లో సూపర్ పాపులర్ అయిన తమిళ్ హీరో విజయ్ ఆంథోని తర్వాత తన సినిమాలను వరుసగా తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు…కానీ వాటిలో ఏవి అనుకున్న అంచనాలను అందుకోవడంలో సఫలం కాలేదు. ఇక రీసెంట్ గా ఇంద్రసేన అంటూ మరో డబ్బింగ్ మూవీ ని తెలుగు లో భారీ గానే రిలీజ్ చేయగా సినిమా కి పెద్దగా టాక్ పాజిటివ్ గా రాలేదు.

దాంతో వీకెండ్ వసూళ్లు కూడా ఆశించిన విధంగా రాలేదు…ఇప్పుడు మొదటి వారం పూర్తి అయ్యే సరికి సినిమా ఆల్ మోస్ట్ ప్యాకప్ చెప్పేసింది…కాగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్స్ బిజినెస్ ని ఏమాత్రం అందుకోకుండా ఆగిపోయి అందరికీ షాక్ ఇచ్చింది.

నైజాంలో 28 లక్షలు, సీడెడ్ లో 13 లక్షలు….టోటల్ ఆంధ్రాలో 25 లక్షల షేర్ ని అందుకున్న ఈ సినిమా మొత్తం మీద 66 లక్షల షేర్ తో బాక్స్ ఆఫీస్ పరుగు ఆపి తెలుగులో సుమారు 2.4 కోట్ల రేంజ్ లో నష్టాలను మిగిలించింది….దాంతో నిర్మాత ఇప్పుడు తెలుగు డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ పైనే ఆశలు పెట్టుకున్నాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here