ఇంత కష్టపడితే వచ్చింది 7….మంచి సినిమాకి ఏమైంది??

0
734

మంచి సినిమాలు రావడమే గగనం అయ్యాయి అనుకుంటే వచ్చిన మంచి సినిమాలకు కలెక్షన్స్ లేకపోతె మరింత కష్టం అని చెప్పొచ్చు.  ప్రస్తుతం సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన గరుడ వేగ సినిమా తో రాజశేఖర్ కి మంచి కంబ్యాక్ లభించినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి కలెక్షన్స్ మాత్రం ఆశించిన విధంగా రాలేదు.. థియేటర్స్ చాలా తక్కువ అవ్వడం పెంచుకునే చాన్స్ కూడా లేకపోవడం సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపింది.

రిలీజ్ విషయం లో మంచి డేట్ చూసుకున్నా ఫలితం వేరేలా ఉండేది కావచ్చు కానీ గరుడ వేగ రిలీజ్ డేట్ కి భారీ పోటి లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్నా ఇలాంటి జానర్ సినిమాలు తెలుగు లో ఆడవు అన్న అపవాదుని నిజం చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సినిమా ఫ్లాఫ్ గా మారనుంది.

మొత్తం మీద ఓన్ రిలీజ్ ని పక్కన పెడితే 11.5 కోట్ల బిజినెస్ చేసిన గరుడవేగ 12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఇప్పటి వరకు 7.22 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుంది. 2 వారాలు అయిపోవడంతో మూడో వారం నుండి సినిమా మరింత తక్కువ థియేటర్స్ లో రన్ అవుతుండటంతో బ్రేక్ ఈవెన్ అవ్వడమ కష్టమే అని తేలింది. దాంతో సినిమా ఫ్లాఫ్ జాబితాలో ఎంటర్ అయినట్లే అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here