ఇంత కష్టపడింది 11 కోట్ల కోసమా….

0
5289

తెలుగు సినిమా మార్కెట్ ని దశదిశలా వ్యాప్తింప జేయాలి అని భావించేవారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరని చెప్పొచ్చు. బాహుబలి కి ముందు నుండే తన సినిమాలను తెలుగు తమిళ్ మలయాళం లో రిలీజ్ చేసి మార్కెట్ ఎక్స్ పాన్షన్ చేయాలని ప్రయత్నాలు చేసినా అవేవి పెద్దగా కార్యరూపం దాల్చలేదు. కాగా ఇప్పుడు చేసిన స్పైడర్ తో తమిళ్ తో పాటు మలయాళం కూడా డైరెక్ట్ గా అడుగుపెట్టాడు మహేష్.

 కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ తెలుగు ఆడియన్స్ కన్నా కూడా తమిళ్ ఆడియన్స్ నుండి యునానిమస్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దానికి కారణం మురగదాస్ పై అక్కడ ఉన్న క్రేజ్ అని చెప్పొచ్చు. ఇక తెలుగు లో మహేష్ ని ఎలా చూడాలి అని అభిమానులు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో అలా అయితే మురగదాస్ చూయించలేదు.

కానీ తమిళ్ లో అలాంటి అంచనాలు లేకపోవడంతో డైరెక్ట్ గా వచ్చిన మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇంత చేస్తే ఇప్పటివరకు కేవలం 11 కోట్ల లోపు షేర్ ని మాత్రమే సాధించింది…దాంతో డైరెక్ట్ తెలుగు వాళ్ళని టార్గెట్ చేసినా ఇక్కడ కలెక్షన్స్ భీభత్సంగా ఉండేవని కొందరు విమర్శిస్తున్నా…ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో మహేష్ రానున్న రోజుల్లో తమిళ్ లో దుమ్ము లేపడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here