ఇంటెలిజెంట్ మూవీ రన్ టైం డీటైల్స్…పెర్ఫెక్ట్ అనొచ్చా?

  మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇంటెలిజెంట్… ఖైదీ నంబర్ 150 లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత వివివినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 9 న రిలీజ్ కానుంది…కానీ సినిమాపై బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు పెద్దగా బజ్ లేదనే చెప్పాలి. కాగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ని సొంతం చేసుకుందని సమాచారం.

ఇక సినిమా రన్ టైం వివరాలు కూడా రిలీజ్ అయ్యాయి. సినిమా మొత్తం మీద 2 గంటల 10 నిమిషాల రన్ టైం ని మాత్రమె కలిగి ఉండబోతున్నట్లు సమాచారం… అందులో మొదటి అర్ధభాగం 1 గంటా 10 నిమిషాలు ఉండబోతుందట.

కాగా రెండో అర్ధభాగం 1 గంట ఉండబోతుందట… లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు సాయి ధరం తేజ్ కి ఎంతో కీలకం అని చెప్పొచ్చు. వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న సాయి ధరం తేజ్ ఈ సినిమా తో ఎంతవరకు కంబ్యాక్ చేస్తాడు అనేది ఇప్పుడు అందరి లోను ఆసక్తి ని రేపుతుంది. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Leave a Comment