ఎన్టీఆర్-విక్రమ్ కుమార్… మనం-24 ని మించే కథ!!

0
2952

  వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో భీభత్సం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు. క్రేజీ కాంబినేషన్ లు సెట్ చేస్తూ తన ఫ్యూచర్ ని అల్టిమేట్ లెవల్ లో బిల్డ్ చేసుకుంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ముందుగా త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఆ తర్వాత కొరటాల తో సినిమా అనుకున్నా కొరటాల వేరే కమిట్ మెంట్స్ తో ఉండటం తో ఓ క్రేజీ డైరెక్టర్ కి ఓకే చెప్పాడు.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు…..తెలుగు లో ఇష్క్, మనం, లాంటి క్లాసిక్స్ ఇచ్చి 24 సినిమాతో సౌత్ మొత్తం ఊపేసిన విక్రమ్ కుమార్. ప్రస్తుతం అఖిల్ తో హలో సినిమా చేసిన విక్రం కుమార్ ఆ సినిమా తో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నా కమర్షియల్ హిట్ సొంతం చేసుకోలేదు…దాంతో కసిగా కొత్త కథ రాస్తున్నాడట…ఆ కథ ఎన్టీఆర్ కోసం అని టాక్ నడుస్తుంది…

కథా చర్చలు రీసెంట్ గా ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్లు సమాచారం. వీళ్ళ కలయికలో వచ్చే సినిమా 24 సినిమాను కూడా మించే రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. కానీ ఎన్టీఆర్ ఈ సినిమా త్రివిక్రమ్ సినిమాతో సమానంగా చేస్తాడా లేక ఆ సినిమా అయ్యాక చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here