రెండు తెలుగు రాష్ట్రలను ఊపేస్తున్న ప్లాన్ “బి”…రచ్చ షురు!!

  పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ గత వారంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించగా, సినిమా టైటిల్స్ లో వెంకటేష్ కు కృతజ్ఞతలు తెలిపిన నిర్మాతలు, రిలీజ్ రోజున మాత్రం వెంకటేష్ సీన్లను తీసేశారన్న విషయం కూడా తెలిసిందే. సినిమా హిట్ అయితే, కనీసం రెండు వారాల తరువాత వెంకటేష్ నటించిన సీన్లను కలపాలని చిత్ర యూనిట్ భావించింది.

అయితే, సినిమా ఫ్లాప్ అంటున్న నేపథ్యంలో ఈ పండగ సెలవుల్లో మరింత మందిని, ముఖ్యంగా వెంకీ అభిమానులను థియేటర్లకు రప్పించేందుకు ‘వీ’ ప్లాన్ ను వెంటనే అమలు చేయాలని పవన్ కల్యాణ్ భావించారట. ఆపై సంక్రాంతి సందర్భంగా వెంకటేష్ నటించిన సీన్లను కలుపుతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇక ‘అజ్ఞాతవాసి’లో ‘ప్లాన్ ఏ’, ‘ప్లాన్ బీ’ అంటూ పలుమార్లు వినిపిస్తుంది. ఇక కలెక్షన్ల కోసం వేసిన ఈ ‘ప్లాన్ వీ’ ఎంతవరకూ ఫలిస్తుందో, నష్టాల నుంచి ఏ మేరకు కాపాడుతుందో వేచి చూడాలి. కానీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ రేపు మరియు ఎల్లుండి మూడు రోజులు సెలవులు ఉండటం సినిమాకి కలిసి వచ్చే అంశం అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Leave a Comment