ఇంటెలిజెంట్ మూవీ రివ్యూ…అసలు వినాయకేనా సినిమా తీసింది!!

0
393

       వివివినాయక్ అంటే ఒకప్పుడు కమర్షియల్ గా ఎలాంటి సినిమా అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కొట్టే టాప్ డైరెక్టర్…ఒక దశలో రాజమౌళి తర్వాత ప్లేస్ లో ఉన్న వినాయక్…తర్వాత కామెడీ బాట పట్టి మెల్లగా నంబర్ గేం నుండి బయటికి వచ్చి కొన్ని హిట్స్ కొట్టిన అల్లుడుశీను, అఖిల్ తో అంచనాలు తప్పాడు. మళ్ళీ ఖైదీనంబర్ 150 తో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని పూర్వ వైభవాన్ని తిరిగి సొంతం చేసుకుంటాడు అని అంతా భావించారు.

ఇలాంటి సమయంలో పెద్ద హీరోలతో కాకుండా యంగ్ హీరో సాయి ధరం తేజ్ తో ఇంటెలిజెంట్ మూవీని మొదలు పెట్టిన వినాయక్ యంగ్ హీరో కి హిట్ ఎట్టి పరిస్థితులలో కావాల్సిన సమయంలో అడుగు పెట్టడంతో కచ్చితంగా సూపర్ హిట్ ఇస్తాడని అంతా భావించారు.

వీళ్ళ కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఇంటెలిజెంట్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా సినిమా చూసిన జనాలు ఎప్పుడో అరిగిపోయిన స్టొరీ లైన్ ని ఎన్ని సార్లు వాడి సినిమా తీస్తే జనాలు మళ్ళీ మళ్ళీ చూస్తారు అనిపించేలా తీయగా ప్రేక్షకుల రెస్పాన్స్ తో దిమ్మతిరిగిపోయింది.

ఏమాత్రం కొత్తతనం లేని కథని ఎంచుకుని దానికి నీరసమైన స్క్రీన్ ప్లే ని అద్ది ఒకటి రెండు కామెడీ సీన్స్ పెట్టి వినాయక్ సినిమాను ఎదో చుట్టేసాం అనిపించేలా సినిమాను తెరకెక్కించి ఇది వినాయక్ తీసిన సినిమా నేనా అనే అనుమానం కలిగేలా చేశాడు.

మొదటి ఫ్రేం నుండి కొంచం ఇంటరెస్ట్ క్రియేట్ చేసినా కానీ తర్వాత పూర్తిగా గాడి తప్పిన సినిమా ఎక్కడా కోలుకోలేదు. ఇక సాయి ధరం తేజ్ తనలోని నటున్ను నమ్ముకోకుండా ఎప్పుడు పవన్ ని మెగాస్టార్ ని ఇమిటేట్ చేయడమే ధ్యేయం అంటూ సినిమాలో ఎక్కువగా ఇమిటేషన్ తోనే సరిపెట్టాడు.

దాంతో పాటు చిరు సూపర్ హిట్స్ లో ఒకటైన చమక్ చమక్ చాం సాంగ్ ని రీమేక్ చేసి బిలో యావరేజ్ మార్కులే దక్కించుకున్నాడు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాటి కేవలం సాంగ్స్ లో వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది.

సినిమా మొత్తం మీద ఒకటి రెండు కామెడీ సీన్స్ ఒకటి రెండు ఫైట్ సీన్స్ తప్పితే ఏవి ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అయితే లేవనే చెప్పాలి. ఇలాంటి సినిమా వినాయక్ నుండి వస్తుంది అని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు.

కమర్షియల్ మూవీస్ లో ఇలా షాక్ ఇచ్చిన సినిమాలు తక్కువే…అందులో ఈ సినిమా కూడా ఒకటిగా చేరుతుంది అని చెప్పొచ్చు. సాయి ధరం తేజ్ తన ఫ్లాఫ్ రికార్డును ఈ సినిమా బ్రేక్ వేయాలి అని భావించినా అంత స్ట్రాంగ్ కంటెంట్ తో అయితే రాలేదు అని చెప్పొచ్చు.

Related posts:

#ఎన్టీఆర్28 దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్...150 రోజుల వెయిటింగ్ ఇది
పైసావసూల్@Day 7...బాలయ్య మళ్ళీ షాక్ ఇచ్చాడు
50 ఇన్ 85....ఇదీ ట్రూ బ్లాక్ బస్టర్...అంటే
ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ చిన్న కండీషన్...ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా??
నటవిశ్వరూపానికి ఇండస్ట్రీ మొత్తం షాక్
రెండో రోజు స్పైడర్ కలెక్షన్స్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి
మెగా ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్...రామ్ చరణ్ 365 డేస్ కష్టం ఇది
అన్నిచోట్లా తోపు...ఈ ఒక్క చోటే వీక్...ఈసారి 25 కొట్టాలి సామి!!
(2,91,000) ఈ రికార్డ్ కొట్టే సత్తా ఎవరికి ఉంది??
సూర్య "గ్యాంగ్" తెలుగు బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అజ్ఞాతవాసి ఫస్టాఫ్ అండ్ సెకెండ్ ఆఫ్ లెంత్ ఎంతో తెలుసా??
ఫ్యాన్స్ కి ప్రాణం తిరిగొచ్చింది...కారణం ఇదే
ఇది సాంపిల్ మాత్రమె...పూనకాలు తెప్పించే సీన్స్ ఎన్నో!
హీరో కామెంట్...నా సినిమా ఎప్పుడో నాకే తెలియదు!
అజ్ఞాతవాసి VS భరత్ అనే నేను...19 గంటల తర్వాత ఏది లీడింగో తెలిస్తే షాక్ అవుతారు??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here