జైలవకుశ 2 వ రోజు కలెక్షన్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా అదిరిపోయే కలెక్షన్స్ ని సాధించి సంచలన రికార్డులను GST ఎఫెక్ట్ లోనూ సాధించి సరికొత్త భీభత్సం సృష్టించాడు. ఒకటి తర్వాత ఒకటి మూడు వరుస విజయాల తర్వాత వచ్చిన ఈ సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 32 కోట్ల షేర్ ని వసూల్ చేసి ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

 రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే వల్ల స్లో అయిన ఈ సినిమా మొత్తం మీద రోజు ముగిసే సమయానికి అదిరిపోయే కలెక్షన్స్ ని సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసినట్లు సమాచారం.

ఇక మిగిలిన ఏరియాలలో కలిపి మరో 2 కోట్లకు పైగా షేర్ వచ్చినట్లు చెబుతుండగా మొత్తంమీద 8.2 కోట్ల షేర్ ని అందుకున్నట్లు చెబుతున్నారు. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో అని అందరు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Leave a Comment