జైలవకుశ లేటెస్ట్ షాకింగ్ న్యూస్…వింటే కేకలే

  టెంపర్ నుండి పూర్తిగా మారిపోయిన ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో మరియు జనతాగ్యారేజ్ సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ముఖ్యంగా జనతాగ్యారేజ్ యావరేజ్ రివ్యూలతో కూడా అద్బుతమైన ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఇలాంటి అద్వితీయమైన విజయం తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ పై అంచనాలు అమాంతం పెరిగిపోగా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించనుందో సెప్టెంబర్ 21 న తెలియనుంది.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు కలిసి నాటకం వేసే సన్నివేశాన్ని ట్రైలర్ లో చివర్లో చూపించిన విషయం తెలిసిందే…అందరు ఇది సీరియస్ గా సాగిపోయే ఎపిసోడ్ అనుకుంటున్నారు కానీ..

దాదాపు 10 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ లో థియేటర్స్ మొత్తం నవ్వుల పూవులు పూసే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ వేసే జోకులు థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు. మరి ఈ సీన్ ఎంతవరకు రచ్చ చేస్తుందో సినిమా రిలీజ్ అయ్యాక తెలియనుంది.

Leave a Comment