భారీ షాక్ ఇచ్చిన యంగ్ టైగర్…కుశ ముందు జై-లవ [ఉట్టిదే]

0
2059

జై పాత్ర మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది…ఇక లవ పాత్ర క్లాస్ ఆడియన్స్ కి ఇప్పుడిప్పుడే ఎక్కుతుంది అనుకుంటున్న సమయంలో మరి కుశ పాత్ర ఎలా ఉండబోతుంది…పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ మొదలయింది.

ఏమాత్రం లేట్ చేయకుండా నిర్మాత కళ్యాణ్ రామ్ లవ టీసర్ వచ్చిన మరుసటి రోజే కుశ పాత్ర మొదటి లుక్ ని రివీల్ చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఊహించని ఈ సడెన్ సర్పైజ్ తో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

కుశ పాత్ర పోస్టర్స్ చూస్తుంటే కచ్చితంగా సినిమాలో దొంగ గా కనిపించబోతున్నాడు అన్న భావన కలగకమానదు…ఇక ఎన్టీఆర్ యమదొంగ తర్వాత మళ్ళీ జుట్టు పెంచినట్లు ఉన్న ఈ లుక్ సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. మూడు విభిన్న పాత్రలను ఓకే సారి ఎన్టీఆర్ ఎలా పోషిస్తాడో అన్న ఆసక్తి ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here