జై సింహా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని రావచ్చో తెలుసా??

0
733

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీ తో ఓపెన్ అయ్యింది…సంక్రాంతి కి వరుసగా తన సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్న బాలయ్య ఈ సారి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన జై సింహా సినిమాతో రాగా సినిమా అటు మాస్ ఆడియన్స్ ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది..

సినిమా మొత్తం మీద మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎబో యావరేజ్ ఓపెనింగ్స్ దక్కించుకుంది అని చెప్పొచ్చు. దానికి కారణం పోటిలో అజ్ఞాతవాసి మరియు గ్యాంగ్ సినిమాలు ఉండటం ఆడియన్స్ తమ తమ చాయిస్ మేరకు ఒక్కో సినిమాను ఎంచుకుంటున్నారు.

కానీ బాలయ్య జై సింహా సినిమా మిగిలిన సినిమాలతో పోల్చితే ఈ రోజు ఫుల్ లీడింగ్ లో ఉందనే చెప్పాలి. రోజు ముగిసే సరికి కచ్చితంగా 7 నుండి 8 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని సినిమా సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here