జై సింహా ఫస్ట్ డే కలెక్షన్స్…కుమ్మేసిన నట సింహా

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా అలరిస్తూ దూసుకు పోతుంది… కాగా సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకవైపు అజ్ఞాతవాసి మరో వైపు డబ్బింగ్ మూవీ గ్యాంగ్ నుండి పోటి ఎదుర్కోవడంతో కలెక్షన్స్ పరంగా బాలయ్య కెరీర్ బెస్ట్ నంబర్స్ ని నమోదు చేయలేదు.

కానీ ఉన్నంతలో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద అన్ని ఏరియాలలో కలిపి 5 నుండి 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించినట్లు సమాచారం…మొత్తం మీద పైసా వసూల్ ని అందుకుంటుంది అనుకున్నా అలా జరగలేదు.

పోటిలో వరుస రిలీజ్ ల వలన ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్ లో లేకున్నా సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాలలో బెటర్ మూవీ ఇదే అనే టాక్ రావడంతో కచ్చితంగా ఈ వీకెండ్ లో సినిమా మరింత పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Leave a Comment