13 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసిన జై సింహా…ఊచకోత ఇది

0
390

  నట సింహా నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి వసూళ్ళని సాధించింది…రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా బి సి సెంటర్స్ లో జోరు చూపగా ఎ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సినిమా సాధించింది…. కాగా బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమాల జాబితా లోను ఒకటిగా చేరింది.

నైజాంలో 1.05 కోట్లు, సీడెడ్ లో 1.4 కోట్లు మరియు టోటల్ ఆంధ్రాలో 4.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన సినిమా మొత్తంమీద 6.75 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది…ఇక టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 7.8 కోట్లను అందుకోవడం విశేషం అనే చెప్పాలి.

సినిమా మొత్తం మీద 26.2 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ రన్ లో 27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు 7.8 కోట్ల షేర్ ని 13 కోట్ల టోటల్ గ్రాస్ ని అందుకోగా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి మరో 19 కోట్ల మేర కలెక్షన్స్ ని రాబట్టాల్సిన అవసరం నెలకొంది…మరి సినిమా సంక్రాంతి వీక్ లో ఆ మార్క్ కి చేరువ అవుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here