జై సింహా మూడో ప్లేస్ తో దుమ్ము లేపింది సామి!!

        నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కి రిలీజ్ అయ్యి సంక్రాంతి విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే…కాగా సినిమా ఇప్పుడు మొదటి వారం పూర్తయ్యింది కాబట్టి ట్రేడ్ నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే ప్రపంచ వ్యాప్తంగా జైసింహ ఇప్పటి దాకా 23 కోట్ల 30 లక్షల షేర్ రాబట్టాడు. జరిగిన బిజినెస్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా డీసెంట్ ఫిగర్.

థియేట్రికల్ రైట్స్ చాలా రీజనబుల్ గా 28 కోట్ల లోపే అమ్మడం వల్ల చాలా చోట్ల ఇది సేఫ్ వెంచర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పండగ సెలవులు కలిసి రావడం పోటీ అనుకున్న సినిమాలు దీని కన్నా వీక్ గా ఉండటంతో జైసింహ సేఫ్ గా బయటపడేలా ఉన్నాడు.

మొత్తంగా బాలకృష్ణ కెరీర్ మొదటి వారం అత్యధిక వసూళ్లు తెచ్చిన మూడో సినిమాగా కూడా జైసింహ మరో రికార్డు అందుకుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి 41 కోట్ల మొదటి వారం షేర్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా లెజెండ్ 27 కోట్ల 40 లక్షల షేర్ తో రెండో స్థానంలో ఉంది.

జైసింహలో ఇంకాస్త బలమైన విషయం ఉండి ఉంటే లెజెండ్ ని సులభంగా దాటేసేదే. ఇక ఈ రోజు నుంచి వసూళ్లు కొంత మందగించినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. పండగ సెలవులు పూర్తి కావడం – కేవలం మరో రెండు రోజులు మాత్రమే స్కూళ్ళకు – కాలేజీలకు ఇంకా హాలిడేస్ ఉండిపోవడం కొంతవరకు ప్లస్ కావొచ్చు.

పైగా జనవరి 26 దాకా వేరే ఏ తెలుగు సినిమా వచ్చే అవకాశం లేదు జైసింహ ఆ అవకాశాన్ని వాడుకుంటే లాభాల్లోకి ప్రవేశిస్తాడు.మరీ సులభం అయితే కాదు కానీ అసాధ్యం అనలేం. బిసి సెంటర్స్ లో మాత్రం జైసింహ కలెక్షన్స్ స్టడీ గానే ఉండటం బాలయ్య ఫాన్స్ కి ఊరట కలిగించే విషయం. 

Leave a Comment