నందమూరి ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్…జై సింహా బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా భారీ ఎత్తున 12 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే… గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ తర్వాత బాలయ్య చేసిన పైసా వసూల్ అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వడంతో అభిమానులు ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నారు… కాగా సినిమా 12 న రిలీజ్ కానుండగా సినిమా ను నిర్మాత దాదాపు అన్ని ఏరియాలలో ఓన్ గా రిలీజ్ చేస్తుండటం విశేషం.

కానీ సినిమా బిజినెస్ ఓవరాల్ గా మార్కెట్ లెక్కలను బట్టి చూస్తె నైజాంలో 5.5 కోట్లు, సీడెడ్ లో 5 కోట్లు…టోటల్ ఆంధ్రా లో 13.2 కోట్ల రేంజ్ లో జరిగినట్లు సమాచారం..దాంతో టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 23.7 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది…

ఇక కర్ణాటక లో 1.5 కోట్లు…ఓవర్సీస్ లో 1.5 కోట్లు…రెస్ట్ ఆఫ్ ఇండియా లో 50 లక్షలు బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల బయట 3.5 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ బిజినెస్ 27.2 కోట్లు అవ్వగా శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి సుమారు 40 కోట్ల మార్క్ ని అందుకుంది…ఫేడ్ అవుట్ అయిన డైరెక్టర్ తో ఇంత పోరు లో ఇలాంటి బిజినెస్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

Leave a Comment