సంక్రాంతిని ఓ రేంజ్ లో షేక్ చేసిన బాలయ్య భీభత్సం ఈ రేంజ్ లో ఉంది

0
814

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో మంచి వసూళ్లు సాధించింది… 5వ రోజు అసలు సిసలు సంక్రాంతి హాలిడే అవ్వడంతో బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేసుకుంది ఈ సినిమా… పోటి లో ఉన అజ్ఞాతవాసి మరియు గ్యాంగ్ సినిమాల కన్నా కూడా సూపర్బ్ లీడింగ్ తో కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా రోజుని అద్బుతంగా ముగించింది అని చెప్పొచ్చు.

బాలకృష్ణ 102వ సినిమాగా ఈ నెల 12వ తేదీన ‘జై సింహా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా బీసీ సెంటర్లలో బాలయ్య మార్క్ మాస్ మూవీగా తన సత్తా చాటుతోంది. ఈ అయిదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 19.7 కోట్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 23.93 కోట్లను రాబట్టింది.

ఇప్పట్లో పెద్ద సినిమాలేవీ లేవు కనుక, ‘జై సింహా’ సినిమా వసూళ్ల జోరు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. అందువలన మరికొన్ని రోజుల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. బాలకృష్ణ సరసన నయనతారతో పాటు నటాషా దోషి .. హరిప్రియ నటించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here