బాలయ్య ఊరమాస్…జై సింహా రివ్యూ…పూనకాలు సామి

0
531

      నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ సందడి చేయడానికి వచ్చేసింది….గత ఏడాది గౌతమీపుత్ర శాతకర్ణి తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న బాలయ్య ఈ సారి సీనియర్ డైరెక్టర్ కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో జై సింహా అంటూ మంచి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో సంక్రాంతి బరిలో పోటి ని ఎదిరించి దిగాడు.

సినిమా ఎలా ఉందంటే…బాలయ్య మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో అల్టిమేట్ డైలాగ్స్ తో విజిల్స్ తో ఊగిపోయే డాన్స్ మూవ్ మెంట్స్ తో సినిమా అంతా వన్ మ్యాన్ షో గా రచ్చ రచ్చ చేశాడు బాలయ్య…ముఖ్యంగా అమ్ముకుట్టి సాంగ్ లో బాలయ్య వేసిన స్టెప్స్ అద్బుతం…

ఈ ఈజ్ లో ఈ రేంజ్ లో ఎనర్జీ తో బాలయ్య వేసిన స్టెప్స్ చూస్తె బాలయ్య డెడికేషన్ కి సెల్యూట్ చేయాల్సిందే…యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ డైలాగ్స్ విషయం లో మరోసారి తన పవర్ చూపించాడు బాలయ్య..కే.ఎస్.రవికుమార్ కూడా బాలయ్య నుండి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలను సినిమా పెట్టాడు.

కానీ సినిమాలో బాలయ్య నయనతార ల మధ్య లవ్ ట్రాక్ కొంచం కష్టంగా అనిపించింది…కొన్ని చోట్ల కామెడీ వికటించింది…క్లైమాక్స్ మరీ రొటీన్ గా అనిపించింది…సినిమా అక్కడక్కడా స్లో అవ్వడం రొటీన్ అనిపించడం జరిగింది…

ఇది మొత్తం మీద సినిమాపై ఉన్న కంప్లైంట్స్…ఇవి మరీ పట్టించుకునేంత కాకున్నా ఉన్న మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. కానీ ప్లస్ పాయింట్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయని చెప్పాలి. బాలయ్య మాస్ ఫ్యాన్స్ కి సినిమా ఓ విందు భోజనం అని చెప్పొచ్చు.

స్క్రీన్ ప్లే తో దర్శకుడు మ్యాజిక్ చేసి చక చకా సినిమా కొనసాగేలా చేశాడు…చూస్తూ ఉండగానే ఫస్టాఫ్ పూర్తి అవ్వగా సెకెండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పర్వాలేదు అనిపించి తిరిగి స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపిస్తుంది… కానీ క్లైమాక్స్ రొటీన్ గా ఊహించే విధంగానే ముగియడం జరుగుతుంది.

మొత్తం మీద ఎక్కువ మార్కులు కొట్టేసిన వారిలో బాలయ్య, కే.ఎస్.రవికుమార్ ల తర్వాత చిరంతన్ భట్ సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ నిలుస్తుంది….ఫైట్ సీన్స్ కి హీరో ఎలివేషన్ సీన్స్ కి పూనకాలు తెప్పించే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు చిరంతన్ భట్….

హీరోయిన్స్ ఉన్నంతలో బాగానే చేసిన నయనతార కొంచం బెటర్…మిగిలిన పాత్రలలో ప్రకాష్ రాజ్ మరోసారి ఆకట్టుకోగా మిగిలిన ఆర్టిస్టులు ఓకే అనిపిస్తారు….రొటీన్ స్టొరీలలో స్క్రీన్ ప్లే మ్యాజిక్ ని ఇష్టపడితే….మొత్తం మీద సినిమా యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటుంది…

సినిమా సంక్రాంతి సమయంలో ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సత్తా ఉన్న సినిమా…సంక్రాంతి బరిలో మిగిలిన సినిమాలతో పోల్చితే కొంచం అంచనాలు తక్కువగా ఉన్న జై సింహా…ఒక్కసారి థియేటర్స్ లో అడుగుపెట్టిన ప్రేక్షకుల పెదవి పై చిరునవ్వుతో థియేటర్ నుండి సినిమా బాగుంది అనే భావన కలిగిస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here