[రాజమౌళి నెక్స్ట్ మూవీ]- ఫైనల్ లిస్టులో ఎన్టీఆర్-ప్రభాస్

బాహుబలి 2 హ్యూమంగస్ సక్సెస్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా కోసం టోటల్ టాలీవుడ్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది..కాగా ప్రస్తుతం ఫైనల్ లిస్టులో ఓ ఇద్దరు హీరోలు ఉన్నారని ఇండస్ట్రీలో చెబుతున్నారు.

ఆ ఇద్దరు హీరోలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు బాహుబలి హీరో ప్రభాస్ అని అంటున్నారు….ప్రస్తుతం రాజమౌళి రాసుకుంటున్న కథకి ఫైనల్ లిస్టులో ఈ ఇద్దరు హీరోలే ఉన్నట్లు చెబుతున్నారు…దాంతో ఎవరు ఫైనల్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రభాస్ తో ఇప్పటికే బాహుబలి సినిమా కోసం 5 ఏళ్ళు గడిపిన రాజమౌళి ఇప్పుడు తిరిగి ప్రభాస్ తో చేయడం కష్టమేనని ఎన్టీఆర్ తోనే చేసే అవకాశం ఉందని వార్తలు గట్టిగానే శిఖారు చేస్తున్నాయి. మరి ఎవరు ఫైనల్ అవుతారో మరో నెలా రెండు నెలల్లో ఫైనల్ అవ్వబోతుందని చెబుతున్నారు.

Leave a Comment