జవాన్ 2 రోజుల టోటల్ కలెక్షన్స్…..షాకింగ్ అప్ డేట్

0
469

మెగా మేనల్లుడు సాయి ధరం నటించిన లేటెస్ట్ మూవీ జవాన్… బి వి ఎస్ రవి డైరెక్షన్ లో సాయి ధరం తేజ్ మరియు మేహ్రీన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.1 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 3.6 కోట్ల షేర్ ని అందుకుని అదుర్స్ అనిపిస్తూ సాయి ధరం తేజ్ కెరీర్ లో మూడో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

కాగా సినిమా కి టాక్ బాగున్నా మరీ సూపర్ పాజిటివ్ గా లేకపోవడంతో రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తి కరంగా మారగా రెండో రోజు సినిమా కలెక్షన్స్ చాలా ఏరియాలలో మొదటి రోజుతో కంపేర్ చేస్తే సగం వరకు డ్రాప్ అయ్యాయి.

దాంతో రెండో రోజు మొత్తం మీద సినిమా 1.54 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసినట్లు సమాచారం…దాంతో మొత్తం మీద 2 రోజుల కలెక్షన్స్ 5.2 కోట్ల మార్క్ ని అందుకుంది…ఇక మూడో రోజు ఆదివారం అవ్వడంతో సినిమా కలెక్షన్స్ కొంత పుంజుకునే చాన్స్ ఉంది…అన్నీ కుదిరితే వీకెండ్ కలెక్షన్స్ 7 కోట్ల మార్క్ అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here