జవాన్ మూవీ ఫస్ట్ కలెక్షన్స్ ఎంత రావచ్చో తెలుసా??

  మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్… తొలిసారిగా మెహ్రీన్ కి జోడిగా నటించిన ఈ సినిమాకి టాలీవుడ్ పాపులర్ స్టొరీ రైటర్ అయిన బివిఎస్ రవి దర్శకత్వం వహించగా సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు భారీ గా రిలీజ్ అవ్వగా మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓపనింగ్స్ లో మంచి ఆక్యుపెన్సీ ని అంతటా సాధించి మొదటి రోజు వసూళ్ళలో మంచి కలెక్షన్స్ సాధించే దిశగా అడుగులు వేస్తుంది.

ట్రెక్ అనలిస్టుల లెక్కల ప్రకారం సినిమా ఓపెనింగ్స్ ని బట్టి చూస్తె మొదటి రోజు 3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉన్న సినిమాకి 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ అంటే మామూలు విషయం కాదని అంటున్నారు.

సాయి ధరం తేజ్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాగా అందరి చేత కితాబు సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కోసం 16 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…మరి వీకెండ్ లో సినిమా ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అంత బెటర్ అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Comment