పెట్టిన బడ్జెట్ 10…అమ్మింది 16…ఇప్పటి వరకు ఎంత వచ్చిందో తెలిస్తే షాక్??

  మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ కి సుప్రీమ్ తో సూపర్ హిట్ లభించినా తర్వాత చేసిన సినిమాలు అనుకున్న రేంజ్ లో ఫలితాలు ఇవ్వలేదు. మంచి అంచనాలతో వచ్చిన తిక్క మరియు విన్నర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడటం తో ఎలాంటి సినిమాతో వస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్న నేపధ్యంలో సాయిధరం తేజ్ మరో ప్రయోగం తో ప్రేక్షకుల ముందుకు జవాన్ సినిమాతో రీసెంట్ గా వచ్చేశాడు..కాగా సినిమా కలెక్షన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది…

మెహ్రీన్ సాయి ధరం తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా టోటల్ గా దక్కించుకున్న బిజినెస్ ఇప్పుడు ఎంత అనేది ఆసక్తి కరంగా మారింది. కాగా సినిమా ఓవరాల్ గా 13 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కినట్లు సమాచారం. ఇక సినిమాకు బిజినెస్ పరంగా 16 కోట్ల రేంజ్ లో జరిగినట్లు చెబుతున్నారు.

ఏరియాల వారిగా ఫుల్ డీటైల్స్ తెలియకున్నా 16 కోట్ల రేంజ్ లో అంటే పాజిటివ్ టాక్ వస్తే రికవరీ అవ్వడం పెద్ద కష్టం కాదు అంటున్నారు. డిసాస్టర్ టాక్ తెచ్చుకున్న విన్నర్ టోటల్ రన్ లో 15 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది కాబట్టి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా రికవరీ అవుతుంది అని అంతా అనుకుంటున్నా ఇప్పటి వరకు 10.6 కోట్ల షేర్ ని మాత్రమే సాధించింది. ఇంకా 7 కోట్ల షేర్ ని అందుకోవాలి ఈ సినిమా..

Leave a Comment