జవాన్ మూవీ రివ్యూ…సూటిగా సుత్తి లేకుండా!!

సుప్రీమ్ సూపర్ డూపర్ హిట్ తర్వాత మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీస్ అన్నీ అంచనాలు అందుకోవడం లో విఫలం అయ్యాయి. వాటిలో తిక్క మరియు విన్నర్ సినిమాలు తీవ్ర నిరాశని మిగిలించిన తర్వాత సాయి  ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ నేడు ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాలతో వచ్చేయగా సినిమా రిజల్ట్ సాయి ధరం తేజ్ కెరీర్ కి ఇప్పుడు కీలకంగా మారింది అని చెప్పొచ్చు.

ఇక సినిమా కూడా అంచనాలను పూర్తిగా అందుకుంది అంటే కాదనే చెప్పాలి. మంచి పాయింట్ తో సినిమా మొదలయ్యి ఫస్టాఫ్ మొత్తం మంచి ఊపు లో సాగి ప్రీ ఇంటర్వెల్ సీన్ లో అసలు కథ మొదలయ్యి అద్బుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగిపోయేలా చేశాయి.

కానీ సెకెండ్ ఆఫ్ లో అద్బుతంగా సాగాలసిన హీరో విలన్ ల మైండ్ గేమ్ అనుకున్న రేంజ్ లో పండలేదు.. అలా అని మరీ సింపుల్ గాను లేదు… 10 కి 6 మార్కులు వేయించుకునేలా ఉన్న సెకెండ్ ఆఫ్ మరింత బాగుంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేది అని చెప్పొచ్చు.

కానీ సాయి ధరం తేజ్ పెర్ఫార్మెన్స్ అలాగే దేశభక్తి పై చెప్పిన డైలాగ్స్ థియేటర్స్ లో చప్పట్ల వర్షం కురిసేలా చేశాయి. ఇక తమన్ సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఫుల్ మార్కులు కొట్టేశాడు.. మెహ్రీన్ మరోసారి తన లుక్స్ తో ఆకట్టుకుంది.

బివిఎస్ రవి దర్శకుడిగా ఫస్టాఫ్ పాస్ అయినా సెకెండ్ ఆఫ్ యావరేజ్ మార్కులే వేయించుకున్నాడు. ఓవరాల్ గా దేశభక్తి సినిమాలు ఇష్టపడే వారికి జవాన్ నచ్చే చాన్స్ ఉంది. మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అన్న భావన కలిగిస్తుంది. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

Leave a Comment