స్టార్ హీరోలను మించిన జయజానకినాయక TRP రేటింగ్

0
550

  2017 ఇయర్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవలేక పోయిన సినిమాలలో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన జయజానకినాయక సినిమా కూడా ఒకటి… స్వాతంత్ర్యదినోత్సవ వీకెండ్ లో ప్రేక్షలుల ముందుకు ఇతర సినిమాలతో పోటి పడ్డ ఈ సినిమా కలెక్షన్స్ లో ఓపెనింగ్స్ ని సాధించినా క్లీన్ హిట్ గా మాత్రం నిలవలేక ఫ్లాఫ్ సినిమా గా నిలిచింది.

సినిమా బడ్జెట్ మొత్తంగా 35 కోట్లు అవ్వగా సినిమా బిజినెస్ మొత్తంగా 32 కోట్లు చేయగా టోటల్ రన్ లో ఈ సినిమా 20 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది…కానీ టెలివిజన్ లో మాత్రం మంచి TRP రేటింగ్ తో దూసుకుపోయిన ఈ సినిమా మొదటి సారి టెలికాస్ట్ తో పోల్చితే రెండోసారి కూడా దుమ్ము లేపింది.

మొదటిసారి టెలికాస్ అయినప్పుడు 14.12 TRP రేటింగ్  సాధించిన ఈ సినిమా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు కూడా 13.2 TRP రేటింగ్ ను సాధించి సూపర్బ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపి స్టార్ హీరోల సెకెండ్ టైం TRP రేటింగ్  ను కూడా మించే విధంగా సంచలనం సృష్టించింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here