జయ జానకి నాయక ఫస్ట్ రివ్యూ…హిట్టా-ఫట్టా

0
415

కెరీర్ పీక్ స్టేజ్ లో బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్న ప్రయోగం జయ జానకి నాయక నేడు ప్రేక్షకులముందుకు వచ్చేసింది..ఇక్కడి కన్నా ముందు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో ప్రారంభం అయిన ఈ సినిమాకు అక్కడ నుండి వస్తున్న టాక్ బాగానే ఉందని చెప్పాలి.

కెరీర్ తొలినాళ్ళలో బోయపాటి చేసిన భద్ర సినిమాని తలపించిన జయ జానకి నాయక అక్కడక్కడ స్లో అయినా పూర్తిగా బోయపాటి ట్రీట్ మెంట్ తో మాస్ సినిమాలను ఇష్టపడే వాళ్ళని ఆకట్టుకునేలా ఉందని టాక్ వినిపిస్తుంది. క్లాస్ సినిమాలను ఇష్టపడే ఓవర్సీస్ ఆడియన్స్ జయ జానకి నాయక ఎబో యావరేజ్ అని తెల్చేయడమే దీనికి నిదర్శనం.

దాంతో రెగ్యూలర్ షోలకి బోయపాటి సినిమాలు ఇష్టపడే మాస్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం ఖాయమని అంటుండగా…సినిమాకు ఫైట్ సీన్స్ అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యాయని అంటున్నారు. అల్లుడుశీను తర్వాత కమర్షియల్ సక్సెస్ కోసమే ఎదురుచూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తే బోయపాటికి మరో హిట్ పడినట్లే అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here