పనులు మొదలయ్యాయి…ఇక భీభత్సమే

0
1039

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తి అయిపొయింది..టాకీ పార్ట్ మొత్తం షూట్ పూర్తీ అవ్వగా ఇప్పుడు సాంగ్స్ షూటింగ్ జరగబోతుందని సమాచారం. కాగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయట.

ఇక సినిమా అనుకున్నట్లే సెప్టెంబర్ 21 న భారీ ఎత్తున రిలీజ్ కానుండగా యంగ్ టైగర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కుశటీసర్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.దాంతో అందరిలోను ఆసక్తి మరింత ఎక్కువ అయ్యింది.

సెప్టెంబర్ మొదటివారంలో కానీ సెప్టెంబర్ 2 వ వారంలో సినిమా ఆడియో మరియు ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో యంగ్ టైగర్ అభిమానులకు రానున్న రోజుల్లో వరుసగా జైలవకుశ వార్తలే వినిపించనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here