ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన డబ్బింగ్ సినిమా…టోటల్ టాలీవుడ్ షాక్

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెలకొల్పిన రికార్డులు ఎలాంటివో అందరికీ తెలిసిందే…సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో తన సినిమాల టీసర్లతో భీభత్సం సృష్టించడం మనం చూస్తూనే ఉన్నాం. కాగా అలాంటి రేర్ రికార్డులలో ఇప్పుడు ఓ రికార్డ్ బ్రేక్ అయ్యింది. ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది తెలుగు సినిమా కూడా కాదు తమిళ్ డబ్బింగ్ సినిమా.

అసలు మ్యాటర్ ఏంటి అంటే ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమా అఫీషియల్ టీసర్ మొదటి 24 గంటల్లో ఏకంగా 1 లక్షా 93 వేల లైక్స్ ని సాధించి సంచలనం సృష్టించింది. కాగా ఈ రికార్డ్ ను ఇప్పుడు తమిళ్ డబ్బింగ్ మూవీ అయిన సూర్య గ్యాంగ్ బ్రేక్ చేసి షాక్ ఇచ్చింది.

సూర్య నటించిన గ్యాంగ్ టీసర్ మొదటి 24 గంటల్లో ఏకంగా 2 లక్షల 6 వేల లైక్స్ ని సాధించి 10 వేల లైక్స్ కి పైగా లీడింగ్ తో ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. డైరెక్ట్ తెలుగు సినిమాల విషయం లో ఇప్పటికీ టాప్ లోనే ఉన్న ఎన్టీఆర్ జైలవకుశ రికార్డులు బ్రేక్ అయినా మళ్ళీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల సినిమాతో రికార్డ్ కొట్టడం పక్కా అని చెప్పొచ్చు…ఏమంటారు??

Leave a Comment