జస్ట్ ఎన్టీఆర్ వినిపిస్తే వచ్చిన రెస్పాన్స్….పీక్స్ అసలు!!

0
1046

టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక ఫోటో చుట్టూ అనేక కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. మెగా హీరోలు మరియు నంద మూరి హీరోల తో టాలీవుడ్ ఏస్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దిగిన ఫోటో చూసి అతి త్వరలో నే అల్టిమేట్ మల్టీస్టారర్ రాబోతుంది అన్న వార్తా ఇప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపెస్తుండగా కొందరు మాత్రం దీన్ని విమర్శించగా చాలామంది మెగా మరియు నందమూరి అభిమానులు మాత్రం దీన్ని స్వాగతించారు అని చెప్పొచ్చు.

కాగా మెగా హీరోలతో ఈ మధ్య ఎన్టీఆర్ తరుచు కనిపిస్తుండటం అవ్వొచ్చు ఇప్పుడు ఏకంగా మెగా ఈవెంట్ లో ఎన్టీఆర్ పేరు వినపడినప్పుడు  రెస్పాన్స్ కూడా పీక్స్ లో వచ్చింది. రీసెంట్ గా మెగా హీరో సాయిధరం తేజ్ హీరోగా వస్తున్న జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ పరిణామం చోటు చేసుకుంది.

జవాన్ సినిమాకి మొదటి క్లాప్ ఎన్టీఆర్ కొట్టడంతో ఈవెంట్ లో సినిమా కోసం క్లాప్ కొట్టిన ఎన్టీఆర్ కి థాంక్స్ అంటూ సాయిధరంతేజ్ మరియు హరీష్ శంకర్ లు చెప్పగా ఆడియన్స్ ఓ రేంజ్ లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. దాంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ కాంబో కి సమ్మతంగా ఉన్నట్లేనని సంకేతాలు ఇచ్చినట్లే అని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here