కంచుకోటలో రావణుడి సునామీ 4 రోజుల్లో కెరీర్ బెస్ట్…2nd నాన్ బాహుబలి రికార్డ్

  టాలీవుడ్ హీరోలలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పొచ్చు…కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి అక్కడ వరుసగా సూపర్ కలెక్షన్స్ తో తన క్రేజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ అక్కడ సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసి అల్టిమేట్ మూవీ గా నిలిచింది.

అక్కడ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమాగా జనతాగ్యారేజ్ గత ఏడాది రిలీజ్ అయ్యి ఏకంగా 8.2 కోట్ల షేర్ ని వసూల్ చేసి భీభత్సం సృష్టించింది. కాగా నాన్ బాహుబలి మూవీస్ లో ఖైదీనంబర్ 150 9.2 కోట్లతో టాప్ లో ఉంది.

కాగా ఇప్పుడు రిలీజ్ అయిన 4 రోజుల్లోనే జైలవకుశ సినిమా 8.28 కోట్ల షేర్ తో కర్ణాటక లో భీభత్సమైన రికార్డును నమోదు చేసింది…కాగా మొదటి వారం లోనే అక్కడ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ఎన్టీఆర్ పేరిట రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Comment