కర్ణాటక గడ్డపై ఎన్టీఆర్ భీభత్సం…28 గంటలు వీర లెవల్ విద్వంసం

తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పొచ్చు…కెరీర్ లో ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్న ఎన్టీఆర్ అక్కడ వరుస సినిమాలతో క్రేజ్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు.

కాగా ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జైలవకుశ అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సమయంలో ఏకంగా 24 గంటలు నాన్ స్టాప్ గా కర్ణాటకలో ట్విట్టర్ మొత్తం ఎన్టీఆర్ పేరుతొ దుమ్ము రేపగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది జైలవకుశ అఫీషియల్ టీసర్.

ఏకంగా 28 గంటలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యి కర్ణాటకలో ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఎలాంటిదో రుజువు చేసిన జైలవకుశ టీసర్ తో కర్ణాటకలో ఎన్టీఆర్ కి ఎదురులేదని మరోసారి రుజువు అయ్యింది..ఇంకా 2 టీసర్లు వస్తాయి కాబట్టి అవి కూడా రచ్చ చేయడం ఖాయం.

Leave a Comment