ఇదీ రికార్డ౦టే…30 గంటలు పక్క రాష్ట్రం ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోయింది

0
1684

రెండు తెలుగు రాష్ట్రాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. అక్కడ గత 7 ఏళ్లలో ఒక్క ఫ్లాఫ్ కూడా లేని యంగ్ టైగర్ తన అద్బుత ఫామ్ లో ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉన్నాడు.

దాంతో ఎన్టీఆర్ గురించిన ఏ చిన్న న్యూస్ అయినా అక్కడ ఓ రేంజ్ లో ట్రెండ్ అవ్వడం కామన్ అయింది. జైలవకుశ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు 24 గంటలు ట్రెండ్ అవ్వగా జై ఫస్ట్ లుక్ రిలీజ్ సమయంలో 28 గంటలు కర్ణాటక దద్దరిల్లిపోయింది.

ఇప్పుడు లవ టీసర్ కి తోడూ కుశ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయగా కర్ణాటకలో ఏకంగా 30 గంటల పాటు నాన్ స్టాప్ గా ట్రెండ్ చేస్తూ సంచలన రికార్డులు నమోదు చేశారు. ఇది అల్టిమేట్ రికార్డ్ అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here