నాని డే 6 Vs రామ్ చరణ్ డే 19…ఎంత లీడింగో తెలిస్తే షాక్!!

0
426

  బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి రెండు వారాలు అయిపోయి మూడో వీక్ లో అడుగు పెట్టినా కానీ మూడో వీకెండ్ లో హిస్టారికల్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రంగస్థలం సినిమా ఇప్పుడు మూడో వీక్ లో వర్కింగ్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుంది. మరో పక్క కొత్త సినిమా కృష్ణార్జున యుద్ధం మాత్రం అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోతుంది.

మొత్తం మీద రంగస్థలం సినిమా 19 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఆక్యుపెన్సీ తో తక్కువ థియేటర్స్ లోనే స్టడీ ఓపెనింగ్స్ తో రన్ అయ్యింది. రోజు మొత్తం అదే రేంజ్ లో కంటిన్యు అయిన ఈ సినిమా 90 లక్షల లోపు షేర్ ని అందుకోవచ్చు అంటున్నారు.

ఇక నాని కృష్ణార్జున యుద్ధం సినిమా మరో సారి అంచనాలను అందుకోవడం లో అంతగా సక్సెస్ కాలేక రోజుని పడుతూ లేస్తూ ముగించిన ఈ సినిమా మొత్తం మీద 60 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో మొత్తం మీద 19 వ రోజు లో ఉన్న రంగస్థలం 6 వ రోజులో ఉన్న కృష్ణార్జున యుద్ధం కన్నా 30 లక్షల వరకు లీడింగ్ తో కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here