కృష్ణార్జున యుద్ధం రివ్యూ..దెబ్బ కొట్టింది సామి!!

0
922

కెరీర్ లో వరుస విజయాలతో అల్టిమేట్ విధంగా సినిమా సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ భలే భలే మోగాడివోయ్ నుండి ఒక్క ఫ్లాఫ్ లేకుండా అల్టిమేట్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. నేనులోకల్ తో ఒకసారి MCA సినిమాతో మరోసారి నికార్సయిన హిట్స్ కొట్టిన నాని ఇప్పుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమాలో డ్యూయల్ రోల్ చేశాడు. దాంతోసినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చేసింది.

మరి సినిమా ఎలా ఉందంటే….పల్లెటూరి నాని మరియు రాక్ స్టార్ నాని ఇద్దరి లైఫ్ లోకి హీరోయిన్స్ ఎంటర్ అయ్యాక…కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అవ్వడం…వారి ప్రేమ కోసం ఈ ఇద్దరు అనుకోకుండా కలవడం,  ఎలా తమ ప్రేమ ని గెలిపించుకున్నారు అనేది సినిమా కథ.

ఈ కథని అందించింది ఎక్స్ ప్రెస్ రాజా మరియు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలు తీసిన మేర్లపాక గాంధీ…ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా విషయంలో బడ్జెట్ ఓ రేంజ్లో పెరిగింది.ఆ సినిమాలో ఉన్న ఎంటర్ టైన్మెంట్ పాళ్ళు ఈ సినిమాలో కేవలం మొదటి అర్ధభాగానికే పరిమితం అయ్యింది అని చెప్పాలి.

రొటీన్ కథనే అయినా సినిమా లో ఎంటర్ టైన్మెంట్ ఎక్కువగా ఉండటం కలిసి వచ్చింది, ఫస్టాఫ్ తో పాటు సెకెండ్ ఆఫ్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఎంటర్ టైన్మెంట్ సీన్స్ తో అలరిస్తుంది. దానికి హిప్ ఆప్ తమిజా,  అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ ని బట్టి అద్బుతంగా ఇచ్చాడు హిప్ ఆప్ తమిజా.

రొటీన్ కథని తన వరుస విజయాల తర్వాత చేస్తున్న సినిమాకి ఎంచుకోవడం కొద్దిగా షాకింగ్ అనిపించినా సేఫ్ గేం ఆడిన నాని ఫస్టాఫ్ పరంగా ఆల్ మోస్ట్ సక్సెస్ కూడా అయ్యాడు. తన నటనతో ఆకట్టుకుని మెప్పించి మంచి ఎంటర్ టైనర్ ని ప్రేక్షకులకు అందించేలా అన్ని ఉండేలా చూసుకున్నాడు.

హీరోయిన్స్ అనుపమ మరియు రుస్కాన్ లు ఇద్దరు పర్వాలేదు అనిపించుకోగా మిగిలిన నటీనటులు అందరు ఆకట్టుకున్నారు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇండియన్ లోకేషన్స్ పాటు ఫారెన్ లోకేషన్స్ కూడా చూడముచ్చటగా ఉన్నాయని చెప్పొచ్చు… ఓవరాల్ గా నిర్మాణ విలువలు బాగున్నాయి.

మొదటి అర్ధభాగం వరకు ఫుల్ మార్కులు కొట్టేడిన దర్శకుడు సెకెండ్ ఆఫ్ విషయంలో మాత్రం దేబ్బెశాడు. ఫస్టాఫ్ లో లాగే సెకెండ్ ఆఫ్ ని ఎంటర్ టైనమెంట్ ఎక్కువ పెంచితే సినిమా రేంజ్ పెరిగేది కానీ సినిమా సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం తో ఓవరాల్ గా….

జస్ట్ ఓకే అనిపించుకుంటుంది ఈ సినిమా… సినిమా కూడా చాలా వరకు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే విధంగా ఉండటంతో సెకెండ్ ఆఫ్ స్లో గా కానీ నాని కోసం కచ్చితంగా ఇలాంటి సినిమాను చూడాలి అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

ఈ సినిమాకి ఓవరాల్ గా 123జోష్ ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…రొటీన్ కథనే అయినా అలరించేలా తెరకెక్కించి రెండున్నర గంటలు ఆద్యంతం ఎంటర్ టైన్ చేసిన కృష్ణార్జున యుద్ధం సగం ఆకట్టుకుని సగం కొద్దిగా నిరాశని గురిచేసింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here