కృష్ణార్జున యుద్ధం…ఇన్ సైడ్ టాక్…తెలిస్తే షాక్!!

0
540

  ‘రంగస్థలం’ ఇంకా బ్రహ్మాండంగా ఆడుతూ వుండగా, మరో వారం రోజుల్లో ‘భరత్‌ అనే నేను’ రిలీజ్‌కి సిద్ధంగా వుండగా వస్తోన్న నాని సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ ఏ విధంగా ఫేర్‌ చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి ఈ చిత్రం ఓ విధంగా పరీక్ష కానుంది. ఇంతకాలం స్టార్‌ హీరోల సినిమాలకి దూరంగా తన సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు భారీ సినిమాలతో పోటీ పడుతోంది కనుక నాని తన ఫామ్‌ కొనసాగించగలడా లేదా అనేది చాలా మందికి వున్న సందేహం.

అయితే నాని మాత్రం ఈ చిత్రం ష్యూర్‌ షాట్‌ హిట్‌ అని చెబుతున్నాడు. ఈ చిత్రం చూసి ఎంజాయ్‌ చేయని వారు వుండరని, ప్రేక్షకులకి ఏమి కావాలో ఆ అంశాలన్నిటినీ దర్శకుడు మేర్లపాక గాంధీ పొందుపరిచాడని, కనుక వేరే సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ఆదరణ వుంటుందని నాని చెబుతున్నాడు.

తన మాట మీద నమ్మకం వుంచి సినిమా చూడకుండానే డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ దిల్‌ రాజు తీసేసుకున్నాడని, ఇప్పుడు సినిమా చూసాక ఆయన కూడా దీని గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడని నాని అన్నాడు. ద్విపాత్రాభినయం గతంలో కూడా చేసిన నానికి ఈ చిత్రంలో చేసిన డ్యూయల్‌ రోల్స్‌ చాలా ప్రత్యేకంగా అనిపించాయట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here