కృష్ణార్జున యుద్ధం ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా—ఫట్టా!!

0
801

యంగ్ హీరోలలో మోస్ట్ లక్కీ హీరో ఎవరు అంటే నాచురల్ స్టార్ నాని అనే చెప్పాలి…కెరీర్ మొదట్లో తప్పితే మధ్యలో వరుస ఫ్లాఫ్స్ ఉన్నా కానీ భలే భలే మోగాడివోయ్ నుండి వరుస విజయాలతో, సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు నాని. ఇక గత ఏడాది అయితే మూడు వరుస హిట్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాని MCA సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం అంటూ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు….

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ లో సుమారు 130 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ అయ్యింది. మరి సినిమా కి అక్కడ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…సినిమా కథ ఏమి సరికొత్త కథ ఏమి కాదట.

ఒక రోల్ చిత్తూరు లోకల్ అబ్బాయ్ అయితే మరో రోల్ రాక్ స్టార్…ఇద్దరికీ ఇద్దరు అమ్మాయిలతో లవ్ చిన్న ట్విస్ట్ తో లవర్స్ వేరు అయితే వాళ్ళ ని ఎవరు వేరు చేశారో తెలుసుకునే క్రమంలో రెండు పాత్రలు కలవడం తర్వాత తిరిగి తమ ప్రేమని పొందటం సినిమా కథ….అంటున్నారు.

కామెడీ నే ఎక్కువగా నమ్ముకున్న నాని సినిమాలో చాలా వరకు ఎంటర్ టైనమెంట్ ఉండేలా చూసుకుని సేఫ్ గేం ఆడాడట. మేర్లపాక గాంధీ అందించిన కథ కూడా మరీ కొత్తది కాకుండా చాలా వరకు సీన్స్ ని ఎంగేజింగ్ గాను ఎంటర్ టైన్మెంట్ తో ఉండేలా చూసుకున్నాడట.

దాంతో సినిమా లెంగ్ రెండున్నర గంటలు ఉన్నా కానీ పెద్దగా బోర్ కొట్టే అవకాశం లేకుండా మంచి సీన్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తు పోతూ ఉంటాయని అంటున్నారు. చాలా వరకు సీన్స్ ప్రేక్షకులను అలరించేవిగా ఉండటం ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.

ఇక హిప్ ఆప్ తమిజా అందించిన పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోగా హీరోయిన్స్ రుస్కాన్ మరియు అనుపమలు ఇద్దరు ఆకట్టుకున్నారని, కామెడీ నటినటులు అందరు నవ్వించారని అంటున్నారు, సాంకేతిక నిపుణులు కూడా మంచి వర్క్ ఈ సినిమా కోసం చేశారని అంటున్నారు.

నాని కెరీర్ లో వరుస హిట్లతో దూసుకు పోతున్న తరుణంలో కొత్తగా కాకుండా మంచి ఎంటర్ టైనమెంట్ తో సేఫ్ గేం ఆడి ఆల్ మోస్ట్ గెలిచాడు అంటున్నారు. సెకెండ్ ఆఫ్ కొద్దిగా స్లో అయినా సినిమా మొత్తం మీద అంచనాలను అందుకుంది అంటుండటం విశేషం.

మేర్లపాక గాంధీ అందించిన కథని నాని చాలా వరకు న్యాయం చేయగా సినిమా చాలా వరకు అంచనాలను తగ్గట్లే సాగుతుందని అంటున్నారు… సినిమాను ప్రేక్షకులను అలరించే విధంగా తీర్చిదిద్దడంలో చాలా వరకు సఫలం అయ్యాడు అని అంటున్నారు.

ఓవర్సీస్ నుండి మంచి టాక్ ని దక్కించుకున్న ఈ సినిమా ఓవరాల్ గా చూసుకుంటే హిట్ కల కనిపిస్తుంది అని చెప్పొచ్చు. మరి రెగ్యులర్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందా అని ఇప్పుడు అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here