ఆ సెటిల్ మెంట్ సరిపోదు..ఇంకా కావాలి…త్రివిక్రమ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన లార్గో వించ్ డైరెక్టర్

0
278

ఈ ఏడాదిలో మొట్టమొదటి భారీ అండ్ క్రేజీ సినిమా అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ బేస్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ పై ఉన్న అంచనాలతో ఈ సినిమాపై విపరీతమైన బజ్ వచ్చింది. విడుదలకు ముందు నుంచే అజ్ఞాతవాసి లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమా కథను కాపీ కొట్టి తీశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ సినిమా రీమేక్ రైట్స్ పొందిన బాలీవుడ్ కు చెందిన టి.సిరీస్ న్యాయ పోరాటానికి సిద్ధమవడంతో వాళ్లతో సెటిల్మెంట్ చేసుకున్నారనే టాక్ కూడా ఉంది.

అజ్ఞాతవాసి కాపీ ఆరోపణలు లార్గో వించ్ ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ సల్లే దాకా కూడా వెళ్లాయి. సినిమా రిలీజయ్యాక ఆయన స్వయంగా చూడటంతో పాటు హెచ్చరిక లాంటి ఓ ట్విట్ కూడా పెట్టాడు. ‘‘టి-సిరీస్ తో చేసుకున్న సెటిల్మెంట్ సరిపోదేమో అని నేను భయపడుతున్నాను. ఇది కేవలం ఇండియాకు సంబంధించిన విషయం కాదు.

అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది’’ అని జెరోమ్ సల్లే ట్వీట్ చేశాడు. అంటే ఓ రకంగా తనతో కూడా ఇష్యూ సెటిల్ చేసుకోవాలని.. లేకుంటే లీగల్ యాక్షన్ దాకా వెళ్లాల్సి వస్తుందన్నట్టుగా చెప్పకనే చెప్పాడు. చిలికి చిలికి గాలివానగా మారుతున్న ఈ వివాదం ఇప్పుడు మరెంత దూరం వెళుతుందో అని టోటల్ టాలీవుడ్ ఇప్పుడు షాక్ లో ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here