3 కోట్లతో మొదలైన మహానటి టోటల్ లెక్క తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

0
808

  ‘మహానటి’ సినిమా మీద ముందు నుంచి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తే కనిపించింది. ఇదో గొప్ప సినిమా కాగలదన్న అంచనాలున్నాయి. కానీ ఈ చిత్రం ఎంత మంచి పేరు తెచ్చుకున్నా కమర్షియల్ గా మాత్రం పెద్ద సక్సెస్ కాకపోవచ్చని చాలామంది భావించారు. ఈ తరహా సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చవని.. ఇవి క్రౌడ్ పుల్లర్స్ కావని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి వస్తున్న స్పందన మామూలుగా లేదు. ఈ చిత్రానికి విడుదలకు ముందు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. చాలా చోట్ల నిర్మాత అశ్వినీదత్ సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది.

రిలీజ్ కూడా పరిమితంగానే చేశారు. అయినా కూడా తొలి రోజు ఉదయం సగం థియేటర్లు నిండడమే కష్టంగా కనిపించింది. కానీ ఈ చిత్రానికి వచ్చిన టాక్ తో జనాల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది. సాయంత్రం నుంచి సీన్ మారిపోయింది. ఒక్కసారిగా థియేటర్లు నిండిపోయాయి. వీకెండ్ కోసం ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. శని.. ఆదివారాలకు ఈ సినిమా టికెట్లు దొరకడమే కష్టంగా మారింది. డిమాండ్ నేపథ్యంలో థియేటర్లు పెంచాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఆల్రెడీ ‘నా పేరు సూర్య’ స్క్రీన్లను దీనికి ఇస్తున్నట్లు సమాచారం.

వసూళ్లు అంచనాల్ని మించి ఎక్కడికో వెళ్తాయని ట్రేడ్ పండిట్లు అంటున్నారు. అమెరికాలో వీకెండ్లోనే ఈజీగా మిలియన్ మార్కును దాటేయొచ్చు. ఫుల్ రన్లో 2.5 మిలియన్ కూడా సాధ్యమే. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో షేర్ వచ్చే అవకాశాలున్నాయి. మినిమం ఓ 30 కోట్లయినా షేర్ రావచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో.. ఎ సెంటర్లలో ఈ చిత్రం ఇరగాడేసే అవకాశాలున్నాయి. కచ్చితంగా ఈ చిత్రం ఏ రేంజికి వెళ్తుందని అంచనా వేయడం మాత్రం కష్టమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here