మహానటి దెబ్బకి ఇండస్ట్రీ మొత్తం భయపడుతుంది!!

1
759

  మహానటి సినిమా విడుదలయింది. వాస్తవానికి పెద్దగా ఎక్కువ థియేటర్లు దొరకలేదు. పైగా ఓన్ రిలీజ్. అందువల్ల ముందుగా ఎవరూ దీని రేంజ్ ఎలా వుంటుందన్నది అంచనా వేయలేకపోయారు. సినిమా హిట్ అవ్వకపోతే, వరల్డ్ వైడ్ గా మహా అయితే పది కోట్ల రేంజ్ వుంటుందని, సినిమా కనుక జనాలకు కనెక్ట్ అయితే మాత్రం ఎక్కడికో వెళ్తుందని అనుకున్నారు.
అనుకున్నట్లే వారం మధ్యలో విడుదలనపుడు మార్నింగ్ షో లు అన్ని చోట్లా ఫుల్ కాలేదు. కానీ మాట్నీ నుంచి మాత్రం విడుదలయిన అన్ని థియేటర్లలో ఒక్క టికెట్ మిగలడం లేదు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అప్పర్ క్లాస్ టికెట్ లకు రెండు రాష్ట్రాల్లో భయంకరమైన డిమాండ్ వచ్చేసింది. ఈ వీకెండ్ టికెట్ ల కోసం కిందా మీదా అయిపోతున్నారని థియేటర్ వర్గాలు చెబుతున్నాయి. అయతే నేల క్లాస్ టికెట్ లు మాత్రం అంత స్పీడ్ గా తెగడం లేదట. నేల టికెట్ లు కాస్త స్లోగా తెగుతున్నాయని గోదావరి జిల్లాల రిపోర్టు. సి సెంటర్లను ప్రస్తుతానికి లెక్కలోకి తీసుకోలేమని, కానీ అర్బన్, సెమీ అర్బన్ సెంటర్లలో మాత్రం సినిమా కొన్నాళ్ల పాటు కుమ్మేస్తుందని తెలుస్తోంది.

నైజాంలో అయిదు కోట్ల అడ్వాన్స్ మీద విడుదల చేసారు. ఇప్పుడు చూస్తుంటే నైజాంలో అంతకు అంతా డబుల్ వస్తుందని అంటున్నారు. అయతే థియేటర్లు యాడ్ అవ్వాలి. ఈ రోజుతో థియేటర్లు కొన్ని ఖాళీ అవుతాయి. సో శుక్రవారం నుంచి మహా నటి కలెక్షన్లు కాస్త గట్టిగా కనిపించడానికి అవకాశం వుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here