మహానటి మూవీ జెన్యూన్ రివ్యూ…సూటిగా సుత్తి లేకుండా!!

0
944

          తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండే నటులలో సావిత్రి గారు ఒకరు…మెస్మరైజింగ్ స్రీన్ ప్రజెంస్ తో అతి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ ను సొంతం చేసుకుని తెలుగులో లెజెండరీ అనిపించు కునే విధంగా మారిన సావిత్రి గారి జీవిత చరిత్ర ఆదరంగా మహానటి అనే సినిమా తెరకేక్కడం ఆ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం తో అందరి లోను సినిమా పై మంచి క్రేజ్ ఏర్పడింది అని చెప్పొచ్చు…

మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి…కథ విషయానికి వస్తే సామాన్య అమ్మాయి తెలుగు తమిళ్ ఇండస్ట్రీలను తన నటనతో ఏలి మహానటి గా మారిన తర్వాత లైఫ్ లో జరిగిన కొన్ని పరిణామాల వలన ఎలా డౌన్ ఫాల్ అయ్యింది అనేది సినిమా కథ.

కథ గా చెప్పడానికి సింగిల్ లైన్ స్టొరీ అయినా తెరకెక్కించిన విధానం మాత్రం అబ్బురపరుస్తుంది. ప్రతీ ఫ్రేం ఓ కల్ట్ క్లాసిక్ ని చూస్తున్న ఫీలింగ్ ని కలిగిస్తుంది. మొదటి అర్ధభాగం అంచనాలకు ఏమాత్రం తక్కువ కాని విధంగా ఉండగా సెకెండ్ ఆఫ్ స్లో అయినా బయోపిక్ కాబట్టి సీన్ తో పాటు మనం కూడా ఆ పాత్రకి కనెక్ట్ అయిపోతాం.

మెయిన్ రోల్ లో నటించిన కీర్తి సురేష్ నిజంగానే సావిత్రి గారే మళ్ళీ వచ్చి నటించారా అనిపించేంతగా నటించి మెప్పించింది. ఆమెని తప్ప ఆ పాత్రలో మరెవరిని ఊహించుకునే అవకాశం కూడా లేకుండా నటించి మెప్పించింది  కీర్తి సురేష్.

ఇక సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లకు ఎక్కువ నటించే అవకాశం ఉన్న పాత్రలు లభించగా వారు కూడా తమ పాత్రల్లో జీవించి నటించారు. ఇక సినిమాలో అనేక క్యామియో లు ఉండగా అన్నీ ఆకట్టుకునే విధంగా ఉండటం మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

ఇక సినిమా కి సంగీతం అందించిన మిక్కీ జే మేయర్ మరోసారి తన మ్యాజిక్ ని చూపెట్టగా  బ్యాగ్రౌండ్ స్కోర్ తో మరింత ఆకట్టుకున్నాడు. ఇక సెట్టింగులు అప్పట్లో ఎలా ఉండేవో అలానే చూపెట్టి ఆకట్టుకున్నారని చెప్పొచ్చు.

మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణులు అందరు ఆకట్టుకోగా దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. సీన్ సీన్ కి ఎంత క్లారిటితో సావిత్రి గారి జీవిత చరిత్రతో పాటు అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ ఎలా ఉండేది అన్నది కూడా కల్లటి కట్టినట్లు చూపెట్టాడు.

మొత్తం మీద సినిమా ఓ కల్ట్ క్లాసిక్ జాబితా లో నిలిచే అన్ని అర్హతలు ఉన్న సినిమా అని చెప్పాలి. ఎలాంటి సందేహం లేకుండా థియేటర్ కి వెళ్లి కూర్చుంటే సినిమా అయిపోయాక టైం మిషన్ నుండి 1960 కాలం నుండి మళ్ళీ ఇప్పటి జనరేషన్ కి ట్రావెల్ చేసి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.

123జోష్ రేటింగ్—3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here